తెలంగాణ
Hyderabad: కాలుకు సర్జరీ… గుండెపోటుతో బాలుడు మృతి

Hyderabad: హైదరాబాద్‌లోని టీ-ఎక్స్ హాస్పిటల్‌లో దారుణం వెలుగుచూసింది. వైద్యం వికటించి ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. బాబు కాలుకు చీము పట్టడంతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ -12లోని టీ-ఎక్స్ ఆస్పత్రికి బాబుని తల్లిదండ్రులు తీసుకొచ్చారు. దీంతో చీము తొలగించడానికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. అయితే ఆపరేషన్ చేసే సమయంలో బాబుకు గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు డాక్టర్లు.
మరోవైపు వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ పిల్లాడు మృతి చెందాడని పేరెంట్స్ ఆందోళనకు దిగారు. న్యాయం కోసం టీ-ఎక్స్ ఆస్పత్రి ఎదు ట నిరసన తెలిపారు. జరిగిన విషయం పోలీసులకు తెలియజేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఏడేళ్ల బాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కా రణమని తేల్చారు. బాధితుల ఫిర్యాదుతో టీ-ఎక్స్ హాస్పిటల్‌పై కేసు నమోదు చేశారు.