వ్యాపారం
Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Stock Market: స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1000కి పైగా పాయింట్ల లాభంతో, నిఫ్టీ 350కు పైగా పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 9గంటల 17నిమిషాల సమయానికి సెన్సెక్స్ 1,121 పాయింట్లు లాభపడి 74వేల 961 వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీ 348 పాయింట్ల లాభంతో 22వేల 744 వద్ద ట్రేడవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలకు 90రోజులు బ్రేక్ ఇవ్వడం, ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం వంటి కారణాలతో దేశీయ సూచీలు పాజిటివ్‌గా కదులుతున్నాయి.