Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. రోజంతా తీవ్ర ఒడిదొడుకులకు లోనైన సూచీలు, ట్రేడింగ్ చివరి గంటలో అనూహ్యంగా పుంజుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లు మార్కెట్లకు అండగా నిలిచాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ, సూచీలు లాభాల్లో ముగియడం గమనార్హం. సెన్సెక్స్ 270 పాయింట్ల లాభంతో 83వేల 712 వద్ద స్థిరపడింది. మరోవైపు, నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 25వేల 522 వద్ద ముగిసింది.
అమెరికా టారిఫ్ విధానాలపై నెలకొన్న అనిశ్చితి, భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేకపోవడంతో మదుపర్లు రోజంతా అప్రమత్తంగా వ్యవహరించారు. అయితే, చివరి అరగంటలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు లాభాల బాట పట్టాయి.డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.71 వద్ద కొనసాగుతోంది.