సినిమా

Prabhas: ప్రభాస్ పెళ్లిపై సంచలన అప్‌డేట్!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లిపై మరోసారి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి తాజాగా ఆయన వివాహం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్న ఈ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకుందాం.

టాలీవుడ్ స్టార్ ప్రభాస్ పెళ్లిపై అభిమానుల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు పొందిన ప్రభాస్ వివాహం గురించి గత కొంతకాలంగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా, ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి ఓ పూజా కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ, త్వరలో ప్రభాస్ పెళ్లికి సంబంధించిన శుభవార్తను పంచుకుంటామని సూచనప్రాయంగా తెలిపారు.

ఈ వ్యాఖ్యలతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ప్రభాస్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు, ఎప్పుడు జరుగుతుందనే చర్చ మరోసారి ఊపందుకుంది. ఈ గుడ్ న్యూస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button