తెలంగాణ

మెగాస్టార్ విశ్వంభరపై సంచలన అప్డేట్!

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి, త్రిష నటిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర”పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్న ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ స్టూడియోస్‌తో పనిచేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న “విశ్వంభర” చిత్రం అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత దసరాకు విడుదలైన టీజర్‌కు కొంత నెగటివ్ రెస్పాన్స్ రావడంతో, మేకర్స్ గ్రాఫిక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోస్ ఈ చిత్రం కోసం అత్యాధునిక గ్రాఫిక్స్ అందిస్తున్నాయట. ఈ విజువల్స్ సినిమాకు మరింత బలం చేకూర్చనున్నాయని టీమ్ నమ్మకంగా ఉంది. అన్ని పనులు పూర్తయ్యాకే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీతో “విశ్వంభర” అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button