‘వార్ 2’ నుంచి సంచలన అప్డేట్?

War2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ జోడీతో రూపొందుతున్న ‘వార్ 2’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. తాజా అప్డేట్లో సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి క్రేజీ రూమర్ వైరల్‌గా మారింది.
‘వార్ 2’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ఆసక్తికర చిత్రంగా రూపొందుతోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులను అలరించనున్నాయి. ఇంటర్వెల్ సన్నివేశం కోసం అత్యాధునిక విఎఫ్ఎక్స్తో భారీ స్థాయిలో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సినిమాలో రెండు పాటలు మాత్రమే ఉంటాయని, అందులో ఒకటి హృతిక్, కియారా అద్వానీపై చిత్రీకరించగా, కియారా బికినీ లుక్ ఆకట్టుకోనుందట.
రెండో పాటను ఎన్టీఆర్, హృతిక్‌పై వచ్చే నెలలో ఏడు రోజుల పాటు షూట్ చేయనున్నారు. ఈ పాటలో ఎన్టీఆర్ డ్యాన్స్ స్టెప్స్ అద్భుతంగా ఉంటాయని సమాచారం. ఆదిత్య చోప్రా నిర్మాణంలో, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అంచనాలను మరింత పెంచింది. ఎన్టీఆర్ పాత్రపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.