సినిమా

మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి సంచలన గ్లింప్స్ విడుదల!

Mohanlal: మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ జన్మదిన వేడుకల్లో ‘కన్నప్ప’ టీమ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. జూన్ 27న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయనుంది.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాతో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నారు. ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. క్యారెక్టర్ లుక్స్, టీజర్, పాటలు ఇప్పటికే అభిమానులను ఆకట్టుకున్నాయి. మోహన్‌లాల్ జన్మదినం సందర్భంగా విడుదలైన తాజా గ్లింప్స్ అదిరిపోయింది.

కిరాత పాత్రలో మోహన్‌లాల్ స్క్రీన్ ప్రెజెన్స్, నటనా తీరు అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. దైవిక శక్తితో కూడిన ఈ పాత్రలో ఆయన నటనా ప్రతిభ మరోసారి ఆకట్టుకోనుంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న విష్ణు మంచు, ఇప్పటికే యూఎస్ టూర్‌ను విజయవంతంగా ముగించారు. ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించనుందని అభిమానులు ధీమాగా ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button