తెలంగాణ
Seethakka : మహిళా సాధికారత, సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం

Seethakka : మహిళా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. S.H.G సభ్యులకు 10 రోజుల పాటు హైదరాబాద్లో శిక్షణ అందిస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో 130 ఐఎంఎస్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది సీఎం లక్ష్యమని సీతక్క తెలిపారు.



