తెలంగాణ
Seethakka: అంగన్‌వాడీల పనితీరుపై సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష

Seethakka: శిథిలావస్థలో ఉన్న అంగన్‌వాడీలకు రిపేర్లు చేసేంతవరకు ప్రత్యామ్నయ భవనాలను చూడాలని మంత్రి సీతక్క ఆదేశించారు. వర్షాకాలంలో భవనాలకు పెచ్చులూడే ప్రమాదం ఉన్నందున పిల్లలకు అపాయం లేకుండా చూడాలని మంత్రి సూచించారు. సచివాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క అంగన్‌వాడీల సేవల పనితీరు, మెరుగుదల, పోషకాహారలోప నివారణపై అధికారులకు తగు సూచనలు చేశారు.
సీఎం ఆలోచలనకు అనుగుణంగా అంగన్‌వాడీ కేంద్రాలను దేశానికి రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి సీతక్క తెలిపారు. ఇందిరాగాంధీ జయంతి నవంబర్ 19 లోపు నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా అంగన్‌వాడీ భవనాల నిర్మాణం పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు.