తెలంగాణ
Seethakka: బండి సంజయ్ మత రాజకీయాలకు పాల్పడుతున్నాడు

Seethakka: కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 11 సంవత్సరాలుగా యువకులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా బిజెపి కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి జిల్లాకు 200 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. బండి సంజయ్ మత రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
చెప్పుకోవడానికి అభివృద్ది లేదు, సబ్జెక్ట్ అంతకన్నా లేదన్నారు. ఎన్నికలప్పుడు హిందూ ముస్లీంలను రెచ్చగొట్టి అధికారం కోసం విద్యేష ప్రసంగాలు చేస్తున్నారని మండి పడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదన్న మంత్రి దమ్ముంటే అభివృద్ధి ప్రాతిపదికన ఎన్నికల్లోకి రండన్నారు.