తెలంగాణ
Seethakka: కుక్కపిల్లను దత్తతకు తీసుకున్న మంత్రి సీతక్క

Seethakka: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌లో డాగ్ అడాప్షన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తదిరతులు పాల్గొని కుక్కపిల్లలను దత్తతకు ఇచ్చారు. కొండా సురేఖ చేతుల మీదుగా స్వదేశి కుక్కపిల్లను అడాప్ట్ చేసుకుని ఆదర్శంగా నిలిచారు మంత్రి సీతక్క.
స్ట్రే డాగ్స్‌ను దత్తత తీసుకోవడం ద్వారా వాటికి జీవించే హక్కును కల్పించడమే కాకుండా సమాజంలో మానవత్వాన్ని పెంపొందించవచ్చని పేర్కొన్నారు మంత్రి సీతక్క. ప్రతి ప్రాణికీ జీవించే హక్కు ఉందని, విశ్వాసానికి మారుపేరు కుక్క అని ఆమె అన్నారు.



