సినిమా

సీతా పయనం టీజర్‌తో అదరగొట్టిన యాక్షన్ కింగ్!

Seetha Payanam: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో రూపొందిన ‘సీతా పయనం’ సినిమా టీజర్ లాంచ్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు ఇప్పుడు చూద్దాం.

అర్జున్ సర్జా దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతా పయనం’ చిత్రం టీజర్‌తో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో అర్జున్ కూతురు ఐశ్వర్య సర్జా హీరోయిన్‌గా, కన్నడ స్టార్ ఉపేంద్ర సోదరుడి కుమారుడు నిరంజన్ సుధీంద్ర హీరోగా నటిస్తున్నారు. టీజర్‌లో ఓ యువతి కారు ప్రయాణంలో హీరోతో పరిచయం, ఆ పరిచయం ప్రేమగా మారడం ఆకట్టుకుంటోంది.

ప్రేమ కోసం ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది కథాంశంగా కనిపిస్తోంది. సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ, బిత్తిరి సత్తి కీలక పాత్రల్లో కనిపిస్తుండగా, అర్జున్, ధృవ సర్జా అతిథి పాత్రల్లో మెరవనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button