Kashi: గరుడ పురాణంలో కాశీకి సంబంధించిన సీక్రెట్స్

Kashi: హిందూ మతంలో కాశీని మోక్షానికి ద్వారంగా పరిగణిస్తారు. ఇక్కడ శివుడు స్వయంగా నివసిస్తాడు. ఇక్కడ మరణించిన జీవులకు జనన మరణ చక్రం నుంచి విముక్తిని ఇస్తాడు. ఈ నగరంలో చితి మంటలు 24 గంటలు మండుతూనే ఉంటాయి. మృత దేహాలను దహనం చేస్తూనే ఉంటారు. ఇక్కడ అనేక ఘాట్‌లు ఉన్నాయి. అయితే ఈ నగరంలో 5 మందిని మాత్రం దహనం చేయరట. దీని వెనుక గల కారణాన్ని గరుడ పురాణంలో కూడా వివరించబడింది. అసలు కాశీలో ఎవరి దహన సంస్కారాలు జరగవు..? దీని వెనుక ఉన్న కారణం ఏంటి..?
భారతదేశంలో అనేక తీర్థయాత్ర స్థలాలు ఉన్నాయి. ప్రతి ప్రదేశానికి దాని సొంత ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంటుంది. ఎక్కడికో వెళ్ళడం ద్వారా జీవితంలోని అన్ని పాపాలు తొలగిపోతాయి. వేరే చోటికి వెళ్ళడం ద్వారా అన్ని వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఒక వ్యక్తి ఏ బాధను అనుభవిస్తున్నాడో, దానికి అనుగుణంగానే దర్శనానికి వెళ్తాడు. మోక్ష నగరం అని పిలువబడే కాశీకి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది ముక్తికి, మోక్షానికి ప్రసిద్ధి. శివుడు స్వయంగా కాశీలో నివసిస్తాడని.. ఇక్కడ మరణించి వారికీ మోక్షం లభిస్తుందని చెబుతారు. ఈ కారణంగా చాలా మంది తమ జీవితపు చివరి రోజుల్లో కాశీని తమ నివాసంగా చేసుకుంటారు.
కాశీలో 24 గంటలు చితికి మండుతూ ఉండే అనేక శ్మశాన వాటికలు ఉన్నాయి. అయితే.. ఇక్కడ ఐదుగురు వ్యక్తుల మృతదేహాలను ఎప్పుడూ దహనం చేయరని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ మృతదేహాలను కూడా శ్మశానవాటిక నుండి తిరిగి ఇస్తారట. గరుడ పురాణం ప్రకారం ఇక్కడ చితి బూడిద చల్లారదు. ఋషులు, సాధువులు గరుడ పురాణం ప్రకారం సాధువులు, ఋషుల శరీరాలను ఎప్పుడూ దహనం చేయరు. కాశీలో ఒక సాధువు శరీరానికి జల సమాధి లేదా తహ్లీ సమాధిని ఇచ్చే సంప్రదాయం ఉంది. ఎందుకంటే వారు అప్పటికే గృహస్థ ఆశ్రమాన్ని, అన్ని ప్రాపంచిక సుఖాలను త్యజించారు.
అలాగే కాశీలో 11 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మృతదేహాలను దహనం చేయరు. దీనికి కారణం గరుడ పురాణ నియమం. గరుడ పురాణం ప్రకారం 11 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లవాడు మరణిస్తే, అతని మృతదేహాన్ని దహనం చేయరు. ఎందుకంటే.. 11 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలను దేవుని స్వరూపంగా భావిస్తారు. ఈ కారణంగా వారిని అక్కడ కాల్చడంపై నిషేధం ఉంది. అలాంటి పిల్లలను సమాధి చేస్తారు.
ఇక వీరినే కాకుండా ఇక వీరినే కాకుండా గర్భంతో ఉన్న స్త్రీలను కూడా కాశీలో దహనం చేయరు. గరుడ పురాణం ప్రకారం గర్భిణీ స్త్రీ శవాన్ని కాశీలో దహనం చేయరు. దీని వెనుక కారణం ఏమిటంటే గర్భిణీ స్త్రీ కడుపు ఉబ్బిపోయి, చితి మంట కారణంగా కడుపు పగిలిపోయే అవకాశం ఉంది. కనుక గర్భిణీ స్త్రీ శవాన్ని కాశీలో దహనం చేయరు. గర్భిణీ స్త్రీకి జల లేదా తహ్లీ సమాధి చేయాలనే నియమం ఉండటానికి ఇదే కారణం.
పాము కాటుకు గురైన వ్యక్తులు కాశీలో పాము కాటు వల్ల మరణించిన వ్యక్తిని దహనం చేయరని ఒక నమ్మకం ఉంది. ఒక వ్యక్తి పాము కాటు లేదా విషం కాటు కారణంగా మరణిస్తే అతని శరీరం కూడా దహనం చేయబడదు. అలాంటి వ్యక్తి శరీరంలో 21 రోజులు సూక్ష్మ జీవం ఉంటుందని, అంటే అతను పూర్తిగా మరణించడని చెబుతారు. కనుక అలాంటి వారిని భూమిలో సమాధి చేసే నియమం ఉంది.
ఇందులో ముఖ్యంగా అంటు వ్యాధి ఉన్న వ్యక్తులను హిందూ మత విశ్వాసాల ప్రకారం కుష్టు వ్యాధి లేదా చర్మ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కాశీలో మరణిస్తే అతని మృతదేహాన్ని దహనం చేయరు. అతని మృతదేహాన్ని ఖననం చేస్తే అందులో ఉండే సూక్ష్మ క్రిములు గాలిలో కలిసి మిగతా వారికి బ్యాక్టీరియా సోకే ప్రమాదం ఉందని అందుకే వారిని దహనం చేయరని చెబుతారు.
అటువంటి వ్యక్తులకు భూమిలో ఖననం చేసే సంప్రదాయం ఉంది. అంటు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి మృతదేహాన్ని దహనం చేస్తే గాలిలో బ్యాక్టీరియా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అందువల్ల అలాంటి వారిని కాశీలో దహనం చేయరని చెబుతారు.
కాశీ అనేది కేవలం ఒక నగరం కాదు, హిందూ మతంలో మోక్షానికి చిహ్నం. ఇక్కడ జరిగే ప్రతి ఆచారానికి, ప్రతి సంప్రదాయానికి వెనుక లోతైన శాస్త్రార్థం దాగి ఉంది. ఐదుగురి దహనం జరగకపోవడం కూడా ఒక విశిష్టమైన ఆచారం, ఇది నేటికీ కొనసాగుతూనే ఉంది.



