సినిమా
నితిన్ “తమ్ముడు” నుంచి మరో సాంగ్ సందడి!

Thammudu: యూత్ స్టార్ నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన “తమ్ముడు” సినిమా నుంచి రెండో సాంగ్ అప్‌డేట్ వచ్చేసింది.
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న భారీ అంచనాల చిత్రం “తమ్ముడు”. వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్లుగా, వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఫస్ట్ సాంగ్ భూతం అదిరిపోయే రెస్పాన్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేశాయి.
ఇప్పుడు రెండో సాంగ్ “జై బగళాముఖీ” రేపు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కానుంది. అజనీష్ లోకనాథ్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. మరో హిట్ కొట్టేందుకు నితిన్ సిద్ధమవుతున్నాడు.