తెలంగాణ
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన జరుగుతోంది. తొలివిడత గ్రామ పంచాయతీలకు మొత్తం 22 వేల 230 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డుల కోసం 85 వేల 428 నామినేషన్లు దాఖలయ్యాయి. 5 పంచాయతీలు, 133 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఈనెల 11న తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.



