తెలంగాణ
Suryapet: అద్దె చెల్లించలేదని.. స్కూల్ కు తాళం.. రోడ్డుపైనే నిల్చున్న విద్యార్థులు

సూర్యాపేట తిలక్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తాళం పడింది. మూడేళ్లుగా కిరాయి ఇవ్వడం లేదంటూ భవన యజమాని తాళం వేశారు. స్కూల్ కు వచ్చిన విద్యార్థులు బయటనే వేచి ఉన్నారు. భవన యజమాని స్కూల్‌కు తాళం వేయడంతో పిల్లలను హైస్కూల్‌కు షిప్ట్ చేశారు. మూడేళ్ల కిరాయి ఇవ్వాల్సింది నిజమేనని అయితే ఆరు నెలల క్రితమే ఈ సంవత్సరానికి సంబంధించిన రెంట్ పే చేసినట్లు అధికారులు తెలిపారు.



