తెలంగాణ
Hyderabad: లారీని ఢీకొట్టిన స్కూల్ బస్సు.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు

Hyderabad: మేడ్చల్ జిల్లా నాగారంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెత్త లారీని వివైన్ గ్రేస్ స్కూల్ బస్సు ఢీకొనడంతో విద్యార్థులకు గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు చిన్నారులను ఆస్పత్రికి తరలించారు.
అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు చిన్నారులే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



