తెలంగాణ
హైదరాబాద్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు అద్దం పట్టేలా హైదరాబాద్‌లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఐమాక్స్ పరిధిలోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞశర్మ ప్రారంభించారు.
ఈ ముగ్గుల పోటీల్లో సుమారు 600 మంది మహిళలు పాల్గొన్నారు. పండుగ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు వేసిన రంగవల్లులు చూపరులను మంత్రముగ్దుల్ని చేశాయి. మొదటి బహుమతిగా 51 వేలు, రెండవ, మూడవ బహుమతులుగా 21 వేలు ఇవ్వనున్నట్లు దానం తెలిపారు.



