సినిమా
స్పిరిట్‌పై వంగ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Sandeep Vanga: ప్రభాస్ కొత్త సినిమా స్పిరిట్ గురించి సందీప్ వంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బాక్సాఫీస్ వసూళ్లతో సంబంధం లేకుండా ఈ కథ అభిమానులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.ఇంకా ఎమన్నారంటే..
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ సినిమా గురించి ఆసక్తికర వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభాస్ కెరీర్‌లో ఆయన సినిమాలు అలవోకగా 1000 నుంచి 2000 కోట్ల వసూళ్లు సాధించిన నేపథ్యంలో, స్పిరిట్ కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సందీప్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ సినిమా యాక్షన్, ఎమోషన్స్‌తో నిండి ఉంటుందని, బాక్సాఫీస్ వసూళ్ల కంటే కథే హైలైట్ అని ఆయన అన్నారు. సందీప్ గత చిత్రాల సక్సెస్‌ను బట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



