సమంత ‘శుభం’, శ్రీవిష్ణు ‘సింగిల్’.. యూఎస్‌లో బాక్సాఫీస్ రచ్చ!

తెలుగు సినిమా అభిమానులకు ఈ వారం డబుల్ ధమాకా! సమంత నిర్మాతగా, క్యామియో రోల్లో మెరిసిన శుభం, శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన సింగిల్ ఈ రెండు ఎంటర్టైనర్స్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి.
ఈ శుక్రవారం తెలుగు ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చిన శుభం, సింగిల్ చిత్రాలు బాక్సాఫీస్‌లో సందడి చేస్తున్నాయి. సమంత తొలి నిర్మాణ చిత్రం శుభం హర్రర్ కామెడీ జానర్లో మంచి టాక్ సొంతం చేసుకోగా, శ్రీవిష్ణు నటించిన సింగిల్ కామెడీ ఎంటర్టైనర్గా అదరగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక, యూఎస్ మార్కెట్లోనూ ఈ చిత్రాలు దుమ్మురేపాయి.
శుభం 75 వేల డాలర్స్‌కు పైగా గ్రాస్‌తో శుభారంభం సాధించగా, సింగిల్ 1.5 లక్షల డాలర్స్‌కు పైగా వసూళ్లతో అదరగొట్టింది. ప్రీమియర్స్ నుంచే సాలిడ్ రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రాలు వీకెండ్లో మరింత జోరు చూపే అవకాశం ఉంది. సమంత, శ్రీవిష్ణు మ్యాజిక్ బాక్సాఫీస్‌ను ఎలా రూల్ చేస్తుందో చూడాలి.