Samantha: సమంత సినిమాకి బడా సంస్థల సపోర్ట్!

Samantha: సమంత తన నిర్మాణ సంస్థ ద్వారా తీసిన ‘శుభం’ సినిమా షేక్ చేస్తోంది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పుడే భారీ లాభాలతో దూసుకెళ్తోంది. ఏకంగా పెద్ద సంస్థలు సమంత కోసం ముందుకొచ్చాయి.
సమంత నిర్మాణంలో రూపొందిన ‘శుభం’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రూ.7 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిన్న చిత్రం ఇప్పటికే రూ.3 కోట్ల లాభాలను ఆర్జించింది. సాధారణంగా చిన్న సినిమాల డిస్ట్రిబ్యూషన్‌కు ఆసక్తి చూపని బడా సంస్థలు సమంత కోసం ముందుకొచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ నైజాం డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకొని రూ.1.5 కోట్లు చెల్లించగా, సురేష్ బాబు ఉత్తరాంధ్ర, సీడెడ్ ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్‌ను నిర్వహిస్తున్నారు.
ఈ మద్దతుతో సమంతకు నమ్మకం పెరిగింది. సినిమాపై పాజిటివ్ టాక్ వస్తోంది. ‘శుభం’ హిట్ అయితే, సమంత చిన్న బడ్జెట్ సినిమాల్లో మరిన్ని ప్రయోగాలు చేయనుంది. ఈ విజయం ఆమె నిర్మాతగా స్థిరపడేందుకు కీలక మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.