సినిమా
Samantha: నేడు సమంత పెళ్లి అంటూ ప్రచారం.. రాజ్ మాజీ భార్య పోస్ట్ వైరల్

Samantha: ఇవాళ అగ్రక కథా నాయిక సమంత పెళ్లంటూ ప్రచారం జరుగుతోంది. సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో వీరి పెళ్లి జరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి పోస్ట్ వైరల్గా మారింది.
ఇంటర్నెట్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆమె తాజాగా ఒక చిన్న నోట్ పంచుకున్నారు. తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారని పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం నిడిమోరు భార్య పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.



