లెజెండ్ బయోపిక్‌లో కియారా?

బాలీవుడ్ లెజెండ్ మహానటి మీనా కుమారి బయోపిక్ ‘కమల్ ఔర్ మీనా’కు కియారా అద్వానీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మీనా కుమారి పాత్రలో నటించనున్న ఆమె వర్క్‌షాప్‌లు కూడా అటెండ్ అవుతోంది. ఈ ప్రాజెక్టు అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రీ-ప్రొడక్షన్ పూర్తయింది. వచ్చే ఏడాది షూటింగ్ మొదలవుతుందట.
బాలీవుడ్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన లెజెండ్ మీనా కుమారి. ఆమె జీవితం ఆధారంగా ‘కమల్ ఔర్ మీనా’ బయోపిక్ తెరకెక్కుతోంది. దీనికి సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నాడు. మీనా కుమారి పాత్రకు కియారా అద్వానీ లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తి చేసింది. 1950-60ల నటన శైలి, బాడీ లాంగ్వేజ్, మాటల తీరుపై ఆమె రీసెర్చ్ చేస్తోంది.
ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగిసాయి. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానుంది. కథలో మీనా కుమారి ఎత్తుపల్లాలు, కమల్ అమ్రోహితో సంబంధం, కెరీర్ వెనుక బాధలు కీలకంగా ఉంటాయి. కమల్ అమ్రోహి పాత్రకు యువ నటులతో చర్చలు జరుగుతున్నాయి. మ్యూజిక్, ఆర్ట్ డిజైన్, కాస్ట్యూమ్స్ పాత బాలీవుడ్ గ్లామర్‌ను తిరిగి తెస్తాయి. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ బయోపిక్ పై అందరి చూపు పడింది. కియారా మీనా కుమారి పాత్రలో ఎలా కనిపిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



