తెలంగాణ
Sama Ramamohan Reddy: ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి బయటకు పంపే కుట్ర

Sama Ramamohan Reddy: కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయించాలని ఒక పెద్ద దెయ్యం పావులు కదుపుతుందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి బయటకు పంపే కుట్ర జరుగుతుందన్నారు.
కేసీఆర్ కాపాడకపోతే బీఆర్ఎస్తో కవితకు పేగు బంధం తెగిపోతుందన్నారు. బీఆర్ఎస్కు సంతోష్‌రావును ప్రెసిడెంట్ చేసిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్నారు. జయలలితకు సొంత వాళ్లే వెన్నుపోటు పొడించినట్లు కల్వకుంట్ల కుటుంబంలో జరగబోతుందన్నారు.