Salman Khan: సల్మాన్ ఖాన్ సెంటిమెంట్ బ్రేక్!

Salman Khan: సల్మాన్ ఖాన్ సికిందర్ ఫ్లాప్ తర్వాత కొత్త ప్రాజెక్ట్ బాటిల్ ఆఫ్ గల్వాన్‌తో సిద్ధమవుతున్నాడు. గల్వాన్ లోయ ఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్ గురించి సరికొత్త అప్డేట్ వచ్చింది.
సల్మాన్ ఖాన్ తాజా చిత్రం బాటిల్ ఆఫ్ గల్వాన్‌తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. 2020 గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన తెలుగు సైనికుడు కల్నల్ సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. దర్శకుడు అపూర్వ లఖియా ఈ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు.
సల్మాన్ సాధారణంగా ఈద్‌కు సినిమాలు రిలీజ్ చేసే అలవాటును వదిలి, ఈ చిత్రాన్ని 2026 జనవరి లేదా జూన్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 55-60 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమైతే జూన్‌కు షిఫ్ట్ చేయాలని భావిస్తున్నారు. అయితే 2026 ఈద్ కి ధమాల్ 4, లవ్ అండ్ వార్, టాక్సిక్ వంటి భారీ చిత్రాలతో పోటీ ఉండటంతో సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.