Salman Khan: ఆరోగ్య సమస్యలపై తొలిసారి మాట్లాడిన సల్మాన్ ఖాన్

Salman Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తన 59వ ఏటా కూడా ఎందుకు పెళ్లి చేసుకోలేదో తాజాగా వెల్లడించారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ కూడా నటనపై ఫోకస్ చేస్తున్నానని చెప్పిన సల్మాన్ పెళ్లి గురించి ఏమన్నారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం గురించి అరుదుగా మాట్లాడతారు. 59 ఏళ్ల వయసులోనూ సింగిల్‌గా ఉన్న సల్మాన్ తాజాగా పెళ్లి గురించి మనసు విప్పారు. ట్రైజెమినల్ న్యూరల్జియా, బ్రెయిన్ ఎన్యోరిజమ్, ఏవీ మాల్ఫోర్మేషన్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో జీవితం సాగిస్తున్నానని వెల్లడించారు.
యాక్షన్ సన్నివేశాల్లో గాయాలు తప్పవని, అయినా నటనపై పూర్తి దృష్టి పెట్టానని అన్నారు. ఈ సవాళ్ల మధ్య పెళ్లి గురించి ఆలోచించే సమయం లేదని, నటన, కుటుంబంతో సంతోషంగా ఉన్నానని సల్మాన్ పేర్కొన్నారు. వృత్తిపరంగా విరామం లేకుండా ముందుకు సాగుతున్న సల్మాన్ తన జీవితంలో సంతృప్తిని పొందానని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఫ్యాన్స్‌లో కొత్త చర్చకు దారితీశాయి.