తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సల్మాన్ ఖాన్

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కలిశారు. గురువారం రాత్రి ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సినిమా ప్రమోషన్, పర్యాటకం, పెట్టుబడులు వంటి రంగాలలో కలిసి పనిచేసే అవకాశాలపై చర్చించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ కార్యక్రమంపై కూడా సల్మాన్ ఖాన్ స్పందించారు. తెలంగాణ వేగంగా పురోగతి చెందుతుందని దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ మారుతోందని సల్మాన్ కొనియాడారు.



