Salman Khan: మందు కొట్టి బిగ్ బాస్ కి వచ్చిన సల్మాన్?

Salman Khan: బిగ్ బాస్ హిందీ రియాలిటీషోకు ఎప్పటినుంచో హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు సల్మాన్ ఖాన్. తన హోస్టింగ్ తో ఈ షోకు మరింత క్రేజ్ తీసుకొచ్చాడు. ముఖ్యంగా వీకెండ్ లో సల్మాన్ హాజరయ్యే బిగ్ బాస్ ఎపిసోడ్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. అయితే ఇప్పుడు బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ కు సల్మాన్ ఖాన్ మందు తాగి హోస్ట్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. మరి ఈ ఆరోపణలు నిజమా? పూర్తి వివరాలు చూద్దాం!
బిగ్ బాస్ షోలో సల్మాన్ ప్రవర్తన ఈసారి భిన్నంగా ఉంది. ముఖ్యంగా ఆయన ముఖం బాగా ఉబ్బిపోయినట్లు కనిపించి, కళ్లు కూడా వాచిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసి చాలా మంది సల్మాన్ ఖాన్ తాగి ఉన్నాడని విమర్శించారు. అయితే సల్మాన్ అభిమానులు మాత్రం ఖండిస్తున్నారు. మహాభారత్ హిందీ సీరియల్‌లో నటించిన పంకజ్ ధీర్ ఇటీవలే కన్నుమూశారు.
ఆయన అంత్యక్రియలకు సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఆ తర్వాత రియాద్ వెళ్లి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమిర్, షారుఖ్ ఖాన్‌లతో పాటు సల్మాన్ ఖాన్ వేదికను పంచుకున్నారు. ఆ తర్వాత, అక్కడి నుంచి నేరుగా కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి ఇండియాకు తిరిగి వచ్చారు. ఆ తర్వాత బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్‌కు వచ్చారు. ఈ బిజీ షెడ్యూల్ కారణంగానే సల్మాన్ ఖాన్ సరిగ్గా నిద్రపోలేదట. అందుకే ఆయన కళ్ళు ఉబ్బిపోయాయట. నిద్ర లేకపోవడం వల్ల సరిగ్గా నిలబడలేకపోయాడట. సల్మాన్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని అభిమానులు చెబుతున్నారు. ఇదీ సంగతి.



