Saiyaara: సైయారా ఓటిటి రిలీజ్ ఎప్పుడు?

Saiyaara: బ్లాక్‌బస్టర్ సినిమా సైయారా ఓటిటి రిలీజ్‌పై హాట్ టాపిక్ నడుస్తుంది. ఆహాన్ పాండే డెబ్యూ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ఓటిటి డేట్ గురించి తాజా బజ్ ఏంటి? ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం!
బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సైయారా సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. యంగ్ హీరో ఆహాన్ పాండే డెబ్యూ చిత్రంగా వచ్చిన ఈ మూవీ 300 కోట్ల మార్క్‌ను దాటి ఇంకా థియేటర్లలో దూసుకెళ్తోంది. ఇండియన్ సినిమాలో డెబ్యూ హీరో చిత్రానికి ఇంతటి వసూళ్లు రావడం అరుదు. ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి రిలీజ్‌పై తాజా అప్‌డేట్ వైరల్ అవుతోంది.
సెప్టెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు బజ్ వినిపిస్తోంది. ఈ సినిమా హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ చిత్రం హిందీలో మాత్రమే స్ట్రీమ్ అవుతుందని తెలుస్తోంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సైయారా ఓటిటి రిలీజ్ డేట్‌పై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.