సినిమా
Saif Ali Khan: ఆసుపత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ లిలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు . గత వారం సైఫ్ ఇంటికి చోరీకి వచ్చిన దుండగుడు నటుడిపై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దాడి అనంతరం తీవ్ర గాయాలతో లీలావతి ఆసుపత్రిలో చేరారు.
అక్కడ ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆరు రోజుల చికిత్స అనంతరం ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. వారం పాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని సైఫ్‌కు వైద్యులు సూచించారు.