కల్కి 2లో సాయి పల్లవి ఎంట్రీ?

కల్కి 2898 AD సూపర్ హిట్ తర్వాత సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. దీపికా పదుకొణె సుమతి పాత్రలో కీలకం అయ్యింది. ఇప్పుడు సీక్వెల్‌లో దీపికా తప్పుకున్నాక ఆమె స్థానంలో సాయి పల్లవిని పరిగణిస్తున్నారట. ఈ మ్యాటర్ గురించి పూర్తి వివరాలు చూద్దాం.
కల్కి 2898 AD పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈసారి సీక్వెల్ లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, లతో కలిసి సాయి పల్లవి సీక్వెల్‌లోకి రానున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. దీపికా పదుకొణె వృత్తిపరమైన కారణాలతో సుమతి పాత్ర నుంచి తప్పుకున్నారు.
ఆమె స్థానంలో సాయి పల్లవిని ఫైనల్ చేస్తున్నారని బలమైన ఊహాగానాలు వస్తున్నాయి. సాయి పల్లవి ఈ పాత్రకు సరిపోతుందని యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం రామాయణంలో సీతగా నటిస్తున్న ఆమెకు ఇది మరో భారీ అవకాశం. అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్ అభిమానుల్లో భారీ అంచనాలు రేపుతోంది.



