ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న రష్యా దేశస్తులు

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ముక్కంటిని రష్య దేశస్తులు దర్శించుకున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని రష్యా కు చెందిన సుమారు 40 మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని శిల్ప కళా సౌందర్యానికి రష్యా దేశస్థులు మంత్రముగ్ధుల అయ్యారు.



