అంతర్జాతీయం
Russia-Ukraine: ఉక్రెయిన్‌పై 70 క్షిపణులు, 100 డ్రోన్లతో రష్యా దాడి..

Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలిస్తామన్నారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. రష్యాద దాడి వెనుక ఉద్దేశం.. ఉక్రెయిన్ ప్రజలు చలి నుంచి రక్షణ పొందకుండా చేయడమేనని బైడెన్ చెప్పారు.
నిన్న ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. 70కిపైగా క్షిపణులు, 100కుపైగా డ్రోన్లతో దాడులు చేశాయి. పలు విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని పుతిన్ సేన దాడులు చేసింది. ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఖండించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉద్దేశపూర్వకంగానే.. క్రిస్మస్ రోజున భీకర దాడులు జరిపించారని జెలెన్‌స్కీ ఆరోపించారు. ఇంతకంటే అమానవీయ చర్య ఉంటుందా అని ప్రశ్నించారు.