ఇవాళ భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్

ఇవాళ భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ రానున్నారు. భారత్ – రష్యా 23వ వార్షిక సమావేశానికి హాజరు కానున్నారు. నేడు ప్రధాని మోడీతో పుతిన్ భేటీ కానున్నారు. 25కు పైగా ఒప్పందాలపై భారత్ – రష్యా సంతకాలు చేయనున్నాయి. రష్యా అధ్యక్షుడికి ఐదంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. పుతిన్ పర్యటించే ప్రాంతాల్లో డ్రోన్లతో పహారా కాస్తున్నారు. అన్ని మార్గాల్లో స్నైపర్లను మోహరించారు. ఏఐ కెమెరాలతో ఫేస్ రికగ్నిషన్స్ చేయనున్నారు అధికారులు.
పుతిన్ భారత్‌లో ఉన్నంత కాలం తినే ఆహారం, తాగే నీరు, రోజువారీ వాడే వస్తువులు పూర్తిగా రష్యా నుంచే రప్పిస్తారు. క్రెమ్లిన్ దగ్గర పనిచేసే ప్రత్యేక చెఫ్‌లు వండిన భోజనాన్ని అత్యాధునిక మొబైల్ ల్యాబొరేటరీలో పరీక్షించి మాత్రమే సర్వ్ చేస్తారు. విషపూరితం లేదా ఏదైనా రసాయన జాడ కలుస్తుందేమోనన్న అనుమానంతో ఈ జాగ్రత్త తీసుకుంటారట.
పుతిన్ వాడే టాయిలెట్ కూడా రష్యా నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తారు. ఆయన మలమూత్ర విసర్జనలను కూడా భారత్‌లో వదిలిపెట్టకుండా, సీలు వేసిన కంటైనర్లలో రష్యాకు తిరిగి తీసుకెళ్తారని సోర్సెస్ చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల ఆయన డీఎన్ఏ లేదా ఆరోగ్య సమాచారం ఎవరికీ అందకుండా చూసుకుంటారట.
అదనంగా పుతిన్ సాధారణ మొబైల్ ఫోన్ ఏమాత్రం వాడరు. బదులుగా ఎక్కడి నుంచి వచ్చినా ప్రత్యేకమైన సురక్షిత బూత్‌లోనే టెలిఫోన్ సంభాషణలు జరుపుతారు. ఈ రకమైన అతి కట్టుదిట్టమైన ప్రోటోకాల్ ప్రపంచ నాయకుల్లో ఎవరూ ఇంతలా పాటించడం లేదని, అందుకే పుతిన్ పర్యటన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది.



