ట్రంప్ మాటను పట్టించుకోని రష్యా, ఉక్రెయిన్

Russia-Ukraine: రోగి కోరుకున్నదీ అదే..వైద్యుడు ఇచ్చిన మందూ అదే అనే సామెతకు తగ్గట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ కోరుకున్న మాటను అమెరికా అధినేత ట్రంప్ అనేశాడు. ఇంతకీ ఆ మాట ఏమిటంటే..రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో తాను తల దూర్చబోనని, రెండు దేశాలు అలసి పోతే యుద్ధం ఆగిపోతుందన్నది ట్రంప్ తాజాగా చేసిన విశ్లేషణ.
మధ్యవర్తిగా యుద్ధాన్ని ఆపేస్తా..మాట వినకోపోతే రెండు దేశాల తాట తీస్తా అంటూ ఇప్పటి వరకు ఊకదంపుడు వార్నింగులు ఇచ్చిన ట్రంప్ కి అసలు విషయం బోధపడినట్లు ఉంది. దీంతో ప్రపంచ పటంలో ఉక్రెయి ఉండకూడదని పుతిన్ చేసిన శపథానికి లైన్ క్లియర్ అయిందని రష్యా సైనికులు భావిస్తున్నారు.
రష్యా, ఉక్రెయిన్ వార్ విషయంలో మొన్నటి వరకు జరిగిన దాడులు, ప్రతి దాడులు ఓ ఎత్తైతే..ఈ మధ్య రష్యా నడిబొడ్డుకెళ్లి, ఉక్రెయిన్ పంపిన డ్రోన్లు సృష్టించిన బీభత్సంతో పరిస్ధితి పూర్తిగా చేయి దాటి పోయిందని అమెరికాకు అర్ధమైంది. నిజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కి ఉరక్రెయిన్ డ్రోన్ల దాడి ఇజ్జత్ కా సవాల్ గా మారింది. దీంతో ఇక అమీ,తుమీ తేల్చుకునేందుకు పుతిన్ సిద్ధమైపోయాడు.
పుతిన్ కూడా ఉక్రెయిన్ పై విరుచుకు పడేందుకు ఎదో ఒక కారణం కోసం వెదుకుతున్న తరుణంలో తాజాగా రష్యాపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ల దాడిని అనుకూలంగా మార్చుకోవాలని పుతిన్ స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఇంతవరకు రష్యా దాడులను తప్పుబట్టిన ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఉక్రెయిన్ కూడా రష్యాకు తీసుపోదనే మెసేజ్ వెళ్లిందని పుతిన్ భావిస్తున్నారట.
ఇక దొరికిందే సందు అన్నట్లు ఉక్రెయిన్ పై మిసైళ్లను కురిపించి ఆదేశాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు ఉన్న అన్నీ మార్గాలను పుతిన్ అన్వేషిస్తున్నారని సమాచారం. ఈసారి జరపబోయే దాడులతో ప్రపంచ మ్యాప్ లో ఉక్రెయన్ అనే దేశం ఉనికిని గుర్తించలేనంతగా విధ్వసం సృష్టించే దిశగా పుతిన్ పావులు కదుపుతున్నారట. ప్రతి దాడుల్లో రష్యాకు జరిగే నష్టానికి కూడా పుతిన్ సిద్ధపడిపోయారని సమాచారం.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని తానే ఆపానని తెగ బిల్డప్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..రష్యా ఉక్రెయిన్ ల యుద్దం విషయంలోనూ అదే రకమైన ఓవర్ యాక్షన్ చేద్దామనుకున్నాడు. కానీ ఉక్రెయిన్ దేశాధినేత జెలన్ స్కీ ఇచ్చిన షాక్ తో ట్రంప్ ఖంగుతిన్నాడు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్లో మాట్లాడి మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ చేసే వ్యాఖ్యలకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు ఏ మాత్రం పొంతన లేకుండా ఉంది.
దీన్ని బట్టి అటు రష్యాకానీ ఇటు ఉక్రెయిన్ కానీ ట్రంప్ మాటనున కరివేపాకులా తీసి పారేశాయని స్పష్టమవుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే..ఈ వ్యవహారంలో ట్రంప్ వైఖరిని చూసిన వారంతా ఆయనను ఒక బఫూన్ లా ఫీలవుతున్నారు. ఈ వాస్చవాన్ని గ్రహింటడం వల్లో ఏమో కానీ చివరకు ట్రంప్ కూడా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో వేలు పెట్టబోనని చేతులెత్తేశాడు.
ఈ రెండు దేశాలు కొట్టుకుని అలసిపోతే తప్ప యుద్ధం ఆగేలా లేదని ట్రంప్ తేల్చేశాడు. ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగిందా అంటూ నెటిజన్లు ట్రంప్ ను ఆడుకుంటున్నారు. పుతిన్ అడిగినదే ట్రంప్ అనేశాడు! రష్యా ఉక్రెయిన్ యుద్ధం సాగిపోవాలని కలలుగన్న వాడికి ఇప్పుడు అమెరికా ఆశీస్సులు కూడా లభించినట్లే. రెండు దేశాలు కొట్టుకుని అలసిపోతే యుద్ధం ఆగిపోతుందన్న ట్రంప్ మాటలు, పుతిన్‌కి లైన్ క్లియర్ చేశాయనే భావన రష్యా శిబిరంలో గట్టిగానే వినిపిస్తోంది.