అంతర్జాతీయం
Road Accident: టెంపో ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ దుర్మరణం

Road Accident: టెంపో ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ దుర్మరణం చెందిన విషాదకర సంఘటన శుక్రవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. చీకిలబైలు గ్రామం, బార్లపల్లి కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ సి. సుధాకర్ (50) ఇంటి ముందు ఉన్న శివాలయం వద్దకు వచ్చాడు.
అదే సమయంలో వేగంగా వచ్చిన టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ బాధితున్ని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉందని తాలూకా సిఐ కళా వెంకటరమణ తెలిపారు.