ఆంధ్ర ప్రదేశ్
అదుపు తప్పి బోల్తా పడిన ఆర్టీసీ బస్సు

సిద్దవటం మండలంలోని భాకరాపేట కల్వర్ట్ వద్ద బుధవారం బద్వేలు డిపోకు చెందిన ఆల్ట్రా ఆర్డినరీ ఆర్టీసీ బస్సు కడపకు వెళ్తూ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ సంఘటనలో బస్సు డ్రైవర్ కు స్వల్ప గాయాలవగా, కండక్టర్ కు చెయ్యి విరిగింది.
బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు బోల్తా పడిన విషయాన్ని తెలుసుకున్న బేటాలియన్ పోలీసులు బస్సు అద్దాలను పగులగొట్టి బస్సులో ఉన్న ప్రయాణికులను బయటకు తీశారు.



