ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళం జిల్లాలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే ఈశ్వరరావు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ విచ్చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సుమారు 6000 మందితో పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.



