తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్ ప్రవీణ్ ఫిర్యాదు

RS Praveen: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదుల్లో ఫార్ములా ఈ రేస్ విషయంలో అసలు ముద్దాయిగా సీఎం రేవంత్ రెడ్డిని చేర్చాలని రాసుకొచ్చాడు. ఫార్ములా ఈ రేస్ పై రేవంత్ రెడ్డి తీరు వల్ల తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అనేక పెట్టుబడులు వెనక్కి పోయాయని ఫిర్యాదు చేశారు.
రాజ్యాంగానికి సీఎం రేవంత్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయన్నారు. ఫార్ములా ఈ కార్ రేసు లో అసలు నిజాలు పక్క దారి పడుతున్నాయన్నారు. ఫార్ములా ఈ కార్ రేసు లో ఏలాంటి అవినీతి జరగలేదని అన్నారు. సెక్షన్ 316 ప్రకారం రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.