తెలంగాణ
RS Praveen: కాంగ్రెస్, బీజేపీలు కాళేశ్వరం కూల్చే కుట్ర చేశాయి

RS Praveen: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కూల్చేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్ర చేశాయని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ సంచలన ఆరోపణ చేశారు. కేసీఆర్‌పై రాజకీయ విద్వేశం పెంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డిలు అసాంఘిక శక్తులుగా వ్యవహరించారని మాజీ ఐపీఎస్ అధికారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాలేశ్వరంలోని మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగినపుడు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కుట్ర కోణం నేపథ్యంలో విచారణ కోసం సిట్ వేయాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు.



