Robinhood: రాబిన్ హుడ్ 12 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

Robinhood: యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పెర్ఫార్మన్స్ చూపిస్తుంది? 12 రోజుల్లో ఈ సినిమాకి కలెక్షన్స్ ఎంత వచ్చాయి? పూర్తి వివరాలు చూద్దాం.
నితిన్ హీరోగా నటించిన ‘రాబిన్ హుడ్’ సినిమా రిలీజైన 12 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ గురించి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రం తొలి వారంలోనే భారీ అంచనాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కానీ, వర్కింగ్ డేస్‌లో కలెక్షన్స్ ఊహించని విధంగా డ్రాప్ అయ్యాయి. సమాచారం ప్రకారం, 12 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా దాదాపు 7కోట్ల రూపాయల షేర్‌తో సుమారు 14 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది.
నైజామ్‌లో 2.5 కోట్లు, ఆంధ్రలో 2.8 కోట్లు, సీడెడ్‌లో 80 లక్షలు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, 27.5 కోట్ల బిజినెస్‌తో రూపొందిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు ఇంకా 20 కోట్లకు పైగా అవసరం అని అంచనా. విడుదలకు ముందు హడావుడి చేసినా కలెక్షన్స్ మాత్రం ఊపందుకోలేదు. మరి, రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.