తెలంగాణ

తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలు

ములుగు జిల్లాలో తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. భారీ వర్షాల కారణంగా రేగుమాగు వాగులో పొంగిపొర్లుతోంది. జాతీయ రహదారి 163పై వంతెన మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది.

ఈ పరిస్థితుల్లో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వంతెన ముఖద్వారం వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని అధికారులు సూచించారు. వరద పరిస్థితులు పూర్తిగా తగ్గే వరకు రాకపోకలు నిలిచే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button