ఆంధ్ర ప్రదేశ్
పార్వతీపురంలోని బైపాస్ రోడ్డు గుంతలమయం

పార్వతీపురం పట్టణంలోని అంతర్రాష్ట్ర జాతీయ రహదారి బైపాస్ రోడ్డు గుంతలమయం కావడంతో వాహనదారులకు, స్థానికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. వైసీపీ హయాంలో రోడ్లన్నీ గుంతలమయం అని విమర్శలు గుప్పించిన కూటమి నేతలు తాము అధికారంలోకి వచ్చి 16 నెలలు అయినా సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా సంబందిత అధికారులు చొరవ చూపి రోడ్డును యుద్ద ప్రాతిపదికన వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒరిస్సా సరిహద్దుగా ఉన్న గ్రామాలను పట్టించుకునేవారే లేరని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాలూరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లో అన్నీ చోట్లా రోడ్లు దుస్థితి ఇలానే ఉండటంతో వాహనాలు భారీగా దెబ్బ తినటంతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు.



