తెలంగాణ
తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తున్న రోడ్డు ప్రమాదాలు

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డుప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. వరుస ప్రమాదాలతో రోడ్లు రక్తమోడుతున్నాయి. వరుస ఘటనలు జరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ తీరు మారడం లేదు. నల్గొండ జిల్లా అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేపై రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది.
వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణిస్తున్నారు.



