ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ–గుడివాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

కృష్ణా జిల్లా విజయవాడ- గుడివాడ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోమటిగుంట లాకుల వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడగా.. స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు భార్య భర్తలు మరణించారు. మండవల్లి మండలం కానుకొల్లు గ్రామానికి చెందిన పాలెపు వెంకన్న, గృహలక్ష్మిగా గుర్తించిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.



