తెలంగాణ
Rangareddy: రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Rangareddy: రంగారెడ్డి జిల్లా యాచారం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మాల్ దగ్గర కారును బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అయితే ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వైజాగ్ కాలనీ నుండి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.