ఆంధ్ర ప్రదేశ్
ప్రకాశం జిల్లాలో వల్లూరులో రోడ్డుప్రమాదం.. ఒకరు మృతి.. 19 మందికి గాయాలు

ప్రకాశం జిల్లాలో వల్లూరులో రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సు కల్వర్టును ఢీకొని కాల్వలో పడిపోయింది. పలమనేరు నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 19 మంది గాయపడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ఎలక్ట్రికల్ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులు ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.



