ఆంధ్ర ప్రదేశ్
వినాయక నిమజ్జనంలో విషాదం.. భక్తులపై దూసుకెళ్లిన కారు

అల్లూరి జిల్లా పాడేరులో ప్రమాదం జరిగింది. వినాయక నిమజ్జన కార్యక్రమంలో భక్తులపైకి కారు దూసుకెళ్లింది. దీంతో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పాడేరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.



