తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మాటేగాం గ్రామం వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరోకరు గాయపడ్డారు. మృతుడు యశ్వంత్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



