ఆంధ్ర ప్రదేశ్
పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం.. వరుడు తండ్రి మృతి

Road Accident: పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ముస్తాపురం వద్ద చోటుచేసుకుంది. మైదుకూరుకు చెందిన అబ్బాయికి అనంతసాగరం మండలం మంచాలపల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో పెంచలకోన ఆలయంలో వివాహం జరగాల్సి ఉంది.
ఈ నేపథ్యంలోనే అబ్బాయి వాళ్లు ఆలయానికి వెళ్తుండగా ఆగి ఉన్న మినీ లారీని కారు ఢీకొట్టింది. దీంతో వరుడు తండ్రితో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మరణించగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



